భారతదేశానికి గ్రామాలు వెన్నెముక అని బాపూజీ బలంగా నమ్మారు. అయితే స్వాతంత్య్రానంతరం సదుపాయాల లేమితో గ్రామాల అభివృద్ధి దిగజారింది. కరెంటు ఉండదు. రోడ్లు సరిగా ఉండవు. నైపుణ్య మానవ వనరులు ఉండవు. అలాంటి గ్రామాల రూపురేఖల్ని మార్చడానికి, గాంధీ కలలను నెరవేర్చడానికి ఓ యువతి బయలుదేరింది.
ఆమెది ఢిల్లీ మహానగరం. పేరు సలోని మల్హోత్రా. కడుపులో కూడు కదలని ఉద్యోగం ఉన్నా, కంపెనీ పెట్టాలని రాసిపెట్టున్నపుడు మెదడులో ఆలోచనలు మెదలకుండా ఉండవు. అందుకే టీనెట్ గ్రూపులో ప్రాజెక్టు ఆఫీసరు ఉద్యోగానికి టాటా చెప్పేసి పల్లె వైపు అడుగులు వేసింది. ఆ అడుగులు ఆమెనే కాదు, మరెందరినో గమ్యం చేర్చాయి. అన్ని కంపెనీలూ మానవ వనరులను నగరాలకు తీసుకెళ్తుంటే ఆమె ఉద్యోగాలనే పల్లెబాట పట్టించింది.
2005లో మద్రాసు ఐఐటీ సాయంతో తమిళనాడులోని కొన్ని గ్రామాలను ఎంచుకుంది. అవన్నీ అంతకుమునుపు ఆమె చెన్నైలో ఉద్యోగం చేస్తూ పరిశీలించిన గ్రామాలే. మొదట ఓ ఊళ్లో ఆఫీసు తెరిచింది. పని తెచ్చింది... పనిచేసే వాళ్లను అక్కడి నుంచే తయారుచేసుకుంది. గ్రామాల్లో ఇంటర్‌తో చదువు ఆపేసిన యువతకు కంప్యూటరు, ఇంటర్‌నెట్ తదితర టెక్నాలజీ ప్రాథమికాంశాలు నేర్పి ఉద్యోగాలు ఇచ్చింది. క్రమంగా పని పెరిగింది. ఉద్యోగాలు పెరిగాయి. ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ వ్యవస్థ 2007 ‘దేశి క్రూ సొల్యూషన్స్’గా రూపం సంతరించుకుంది.
ఇదే మొట్టమొదటి రూరల్ బీపీవో. ఇప్పుడు పలు గ్రామాల్లో దేశి క్రూ ఉద్యోగాలు కల్పించింది. అవి గ్రామ ముఖచిత్రాలనే మార్చేస్తున్నాయి. గ్రామంలో బలాదూరుగా తిరిగే యువత గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతోంది. గిట్టుబాటుకాని వ్యవసాయంతో అష్టకష్టాలు పడుతున్న తల్లిదండ్రులకు తమ పిల్లలు అండగా నిలిచేలా చేస్తున్నాయి. దేశి క్రూలో పనిచేస్తున్న వారిలో వంద శాతం గ్రామీణ ఉద్యోగులే. వారిలో 70 శాతం మంది మహిళలే!
అడ్డంకులను అధిగమించి...
సలోని ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దేశి క్రూ సొల్యూషన్స్‌కు ఓ రూపుతెచ్చింది. పల్లెటూళ్లో కంపెనీ పెట్టాలంటే ఎదురయ్యే మొదటి సమస్య విద్యుత్. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పవర్‌తో కంపెనీ నడపడం చాలా కష్టం. రెండో సమస్య ఇంటర్‌నెట్. మూడో సమస్య రవాణా సదుపాయాలు. వీటి నుంచి బయటపడటానికి ఆమె ఎంతో కష్టపడ్డారు. మద్రాసు ఐఐటీ విభాగం ఆర్‌టీబీఐ (రూరల్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఇంక్యుబేటర్), విల్‌గ్రో, తులిప్ కంపెనీల సహకారంతో ముందుకు నడిచింది. వీరిని ఒప్పించడానికి కూడా ఆమెకు చాలా సమయం పట్టింది. ఆమె దేశాన్ని మార్చలేకపోవచ్చు. కానీ, దేశానికి కొత్త గమనాన్ని చూపింది. రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వల్ల పల్లెకు ఉద్యోగాలు తరలిరావడమే కాదు, నగరాలపై భారం తగ్గుతుంది.అక్కడ వస్తుకొరత తగ్గుతుంది.
పల్లెలు తమ ప్రాభవాన్ని కోల్పోకుండా నిలదొక్కుకోగలుగుతాయి. ఆమె ప్రయత్నాన్ని ప్రశంసించకుండా ఎవరూ ఉండలేకపోయారు. మిగతా బీపీవోల కంటే 30-40 శాతం తక్కువ వ్యయానికే వీరు సేవలు అందిస్తున్నారు. బిజినెస్ వీక్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, టాటా హాటెస్ట్ స్టార్టప్ వంటి పలు పురస్కారాలను ఆమె సాధించారు. నేటి మహిళకు ఆమె ఓ చిహ్నం. నేటి తరానికి ఆమె ఒక ప్రోత్సాహం.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more