ప్రొఫైల్
పూర్తి పేరు : సరస్వతి దేవి (శారద)
పుట్టిన తేది : 1945 జూన్ 12
జన్మస్థలం : తెనాలి , గుంటూరు
వృత్తి : నటి, రాజకీయవేత్త, వ్యాపారి
కెరీర్ : 1959 నుంచి
తొలి చిత్రం : కన్యాశుల్కం-1955 (బాలనటిగా)
తాజా చిత్రం : నాయికా (2011) మలయాళం
అవార్డులు : 3 సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు,
ఎన్టీఆర్ జాతీయ అవార్డు-2010
ఆమె శారద
ఊర్వశి శారదగా తెలుగు వారికి సుపరిచితమైన నటి శారద. అనేక హిట్ చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచి పోయారామె. ఆమె అసలు పేరు సరస్వతి శారద. ఆమె 1945 జూన్ 12న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. సత్యవతి దేవి, వెంకటేశ్వర్ రావు ఆమె తల్లిదండ్రులు. శారత తల్లి శారదను చిన్ననాటి నుంచే శాస్త్రీయ నృత్యం నేర్చుకునేలా ప్రోత్సాహించేవారు. దాంతో శారద ఆరు సంవత్సరాల వయస్సులోనే నృత్యంలో మెలుకువలు నేర్చుకోవడం ప్రారంభించి ప్రతి సంవత్సరం దసరా, ఇతర ఉత్సవాలలో శాస్ర్తీయ నృత్యాన్ని ప్రదర్శించేవారు.సినీరంగ ప్రవేశం-ప్రస్థానం
1955లో తెలుగులో విడుదలైన కన్యాశుల్కం చిత్రంలో శారద బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.1955 నుంచి 1961 వరకు బాలనటిగా నటించారు. 1975లో ఒక మలయాళీని పెళ్లి చేసుకుని కేరళకు వెళ్లింది. అక్కడ ఉన్న సమయంలో అనేక మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆమె నటించిన మలయాళ చిత్రం స్వయంవరం ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టింది.. ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో తీశారు. ఈ నాలుగు భాషల్లోనూ శారద నటించారు. మలయాళంలో తులాభారం చిత్రానికి మరోసారి జాతీయ ఉత్తమ నటి వార్బు వరించింది. ఈ చిత్రాలు విడుదలైన తరువాత అప్పటిదాకా హస్య ప్రధాన పాత్రలో నటించిన శారద గంభీరమైన పాత్రలో నటించడానికి ప్రాధాన్యత నిచ్చారు. ఆమె ప్రముఖ నటుడు చలంను వివాహం చేసుకున్నారు. తరువాత వారిద్దరు వేరయ్యారు.
తెలుగులో
ఇతర దక్షిణాది భాషల్లో నటిస్తూ బిజి అయిన శారద చండశా సనుడు చిత్రంతో తిరిగి తెలుగు సినిమాలో రంగప్రవేశం చేశారు. తెలుగులో ఆమె నటించిన మానవుడు దానవుడు, దేవుడు చేసిన మనుషులు,శారద, బలిపీఠం, దాన వీర శూర కర్ణ, గోరింటాకు, కార్తీక దీపం వంటి చిత్రాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో ఆమె నటించి ప్రేక్షకులను మెప్పించారు. నిమజ్జనం చిత్రంలో నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. జాతీయ అవార్డును సాధించిన తొలి తెలుగు నటి శారద కావడం విశేషం. తరువాత కాలంలో శారద పలు చిత్రాలలో తల్లిగా, అక్కగా నటించారు. ఆమె నటించిన చివరి తెలుగు చిత్రం యోగీ. ఈ చిత్రంలో కథానాయకుడు ప్రభాస్ తల్లిపాత్రలో కనిపించారు.
రాజకీయం
1996లో శారద రాజకీయంలోకి ప్రవేశించారు. అప్పటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా తెనాలి పార్లమెంట్ సీటుకు పోటీ చేసి గెలిచారు. అయితే రెండేళ్లకే అప్పటి లోక్‌సభ రద్దు కావడంతో తిరిగి 1998లో ఎన్నికలు జరిగాయి.కానీ రెండవసారి ఆమెకు పరాయజం ఎదురైంది. 2009లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ చాకొలెట్ అనే సంస్థకు శారద యజమాని కూడా.
జాతీయ ఉత్తమ నటి అవార్డులు
1968, తులాభారం, మలయాళం
1972, స్వయంవరం, మలయాళం
1977, నిమజ్జనం, తెలుగుఅవార్డులు
2010 ఎన్టీర్ జాతీయ అవార్డు
1979 కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు
1970 బెంగాలీ ఫిలిమ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డు
1997 ఫిలిమ్‌ఫేర్ జీవిత కాల సాఫల్య అవార్డు( దక్షిణాది పరిశ్రమ)
లెజెండ్స్ తో...
అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన బాబు, కృష్ణా, కృష్ణం రాజు, చలం, సంజీవ్ కుమార్, అనంతనాగ్, శరత్ బాబు, దాసరి నారాయణరావు, జగ్గయ్య, రావు గోపాల్ రావు
శారదపై చిత్రం
మలయాళ చిత్రపరీశ్రమలో అనేక హిట్ చిత్రాలలలో నటించి అగ్ర నటిగా ఎదిగారు శారద. ఆమె జీవిత కథ ఆధారంగా దర్శకుడు జయరాజ్ నాయికా అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం 2011లో విడుదలై విజయాన్ని మంచి పాపులారిటీని సంపాదించింది. ఇందులో ప్రముఖ నటి పద్మప్రియా శారద పాత్రలో కనిపించారు. దర్శకుడు జయరాజ్, నటి మమత మరో కీలకపాత్రలో నటించారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more