Deepika chikhalia interview

deepika chikhalia, deepika chikhalia husband, deepika chikhalia picture gallery, deepika ramayan girl, ramayan deepika chikhalia, deepika ramayana sita, deepika as sita, deepika chikhalia interview, deepika sita

who can rival the beauty, brilliance, and acting of the one and only...Deepika Chikhalia! As Devi Sita, she took our breath away with her gorgeous looks, brilliant acting, and lovely expressions.

deepika chikhalia interview.GIF

Posted: 03/28/2012 04:50 PM IST
Deepika chikhalia interview

Deepika-Chikhalia_interview

Deepika-Chikhaliaఇతిహాసంగా ప్రసిద్ధికెక్కిన పురాణ కథ ఇంటింటి రామాయణంగా మారిన వైనం... ఓ రెండున్నర దశాబ్దాల క్రితం చోటు చేసుకుంది. సీత కష్టాలు సీతవి కావు తమవిగా భావించే ఇల్లాళ్లు, రావణుడిని కత్తికో కండగా నరకాలన్నంత ఆవేశంతో ఊగిపోయిన ఇంటాయనలు, కర్రపుల్లల్ని బాణాలుగా మార్చి లవకుశ తరహా వీరత్వాన్ని ప్రదర్శించే కుర్రకుంకలు... టీవీ ముందు నుంచి లేచినా కాసేపటిదాకా రామాయణ కాలం నుంచి బయటకు రాలేనంత తన్మయత్వంలో దేశమంతా తడిసి ముద్దయిపోయిన రోజులవి. ఇంతటి ఆధ్యాత్మిక సంబరానికి కారణం... రామానంద సాగర్ అందించిన రామాయణం. ఆ టీవీ రామాయణంలో పాతివ్రత్యానికి ప్రతీకగా మహిళల్ని, అద్వితీయ సౌందర్యరాశిగా మగవార్ని ఆకట్టుకున్న సీత ఇప్పుడెక్కడ? వనవాసం చేస్తోందా? ప్రవాసం చేరుకుందా?

ముంబయిలో జన్మించిన ఒక మోడ్రన్ మెట్రో గాళ్... అనుకోకుండా రామానంద సాగర్ కంటపడి, పరమసాధ్వి పాత్రలో ఒదిగిపోవడమే ఒక విచిత్రమైతే... సినిమాల్లో అట్టర్‌ఫ్లాప్ కావడం మరో విచిత్రం. సూపర్ హిట్ రామాయణంలో నటించిన దీపికా చికాలియా అసలు పేరు దీప్తి. తండ్రి టి.రాజేష్ చికాలియా వ్యాపారవేత్త. తల్లి, తనకన్నా చిన్నవాళ్లయిన సోదరి ఆర్తి, సోదరుడు హిమాంశు... ఇదీ కుటుంబం! బి.ఎ. చేసి, విభిన్న రంగాల్లో భవిష్యత్తును వెతుక్కుంటోన్న దీప్తిని చూసిన రామానంద సాగర్‌కు ఆమెలో రామపత్ని పాత్రకు సరితూగే లక్షణాలు కనిపించడంతో ఆమె జీవితం అమాంతం మలుపు తిరిగింది.

ఏడాది పాటు ప్రతి ఆదివారం లక్షలాది కుటుంబాల చేత రామనామ జపం చేయించిందా దూరదర్శన్ దృశ్యకావ్యం. బుల్లితెరపై తొలి పూర్తిస్థాయి పౌరాణిక సీరియల్‌గా ఘనతను దక్కించుకుంది. సీతగా రాణించిన దీపికకు ఎంత క్రేజ్ వచ్చిందంటే ఉత్తరాదిలో చాలా గ్రామాల్లోని ఇళ్లన్నీ ఈ కలియుగ సీత ఫొటోలు పెట్టుకుని పూజలు చేసేంత! బాలీవుడ్ దీపికను వెంటాడి వెంటాడి ఆఫర్లతో వెల్‌కమ్ చెప్పేంత! ఆ తరువాత దీపిక భగవాన్‌దాదా, చీఖ్, సున్ మేరీ లైలా, ఖుదాయ్... తదితర సినిమాల్లో నటించింది. అయితే సీతమ్మ తల్లిగా చూసిన కళ్లు ఆమెను చెట్లు పుట్ల వెనుక గంతులేసే పాత్రల్లో అంగీకరించలేక పోయాయి. మధ్యలో సంజయ్‌ఖాన్ రూపొందించిన స్వోర్డ్ ఆఫ్ టిప్పుసుల్తాన్ ధారావాహికలోనూ ఆమె హీరోకి తల్లిపాత్ర పోషించారు. అయితే దానికి పెద్దగా పేరు రాలేదు. దాంతో దీపిక సినిమా, టీవీ కెరీర్‌కు తెరపడింది. బిగ్ స్క్రీన్‌లో ఇక లాభం లేదనుకున్న దీపికకు తన పట్ల జనంలో ఉన్న క్రేజ్ ఉపయోగించుకోవడానికి రాజకీయం సరైందిగా కనపడినట్టుంది. గుజరాత్‌లోని బరోడా నియోజక వర్గం నుంచి బీజేపీ తరపున గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టింది.

పాలిటిక్స్ టు బిజినెస్...

వెడల్పాటి గాగుల్స్, అల్ట్రామోడ్రన్ డ్రెస్ ధరించి సింగార్ బిందీ, టిప్స్ అండ్ టోస్ కాస్మెటిక్స్ కంపెనీ మార్కెటింగ్ వ్యవ హారాలను పర్యవేక్షిస్తూ కనిపించే 47 ఏళ్ల దీపికను చూస్తే... నాటి సీత అని గుర్తిం చడం కష్టం. ముంబైకే చెందిన సంపన్న వ్యాపారవేత్త హేమంత్ టోపీవాలాను పెళ్లి చేసుకున్న దీపికకు నిధి (12), జూహీ (7) అనే ఇద్దరు కూతుళ్లున్నారు. ప్రస్తుతం ఆమె తన భర్త సంస్థలో ఆర్ అండ్ డి మార్కెటింగ్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

బాగా బిజీగా మారిపోయినట్టున్నారు అంటే... ‘‘ఈ పనులన్నీ ఉదయం 11 నుంచీ సాయంత్రం 4 గంటల దాకా మాత్రమే. ఆ తర్వాత పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తారుగా’’ అన్నప్పుడు ఆమెలోని అమ్మతనం కమ్మగా పలక రిస్తుంది. ఎన్నిసార్లు తిన్నా పరమాన్నం, ఎన్నిసార్లు కన్నా రామాయణం విసుగు పుట్టించవు కదా! మరోసారి ఈ మహా ఇతి హాసాన్ని తెరకెక్కిస్తే అంటే...‘‘ఏం చేసినా అంతటి విజయాన్ని రిపీట్ చేయడం సాధ్యం కాదు’’ అని చెప్తారు. ‘‘అచ్చం రాముడ్ని తలపించిన అరుణ్ గోవిల్, సీతమ్మ పాత్రకు ప్రాణం పోసిన నేను... ఈ కాంబినేషన్ మళ్లీ దొరకడం అంత తేలిక కాదేమో’’ అంటారు. ఇక అలాంటి దారాసింగ్ పాత్రధారిని పట్టుకోవాలంటే వందేళ్లు పట్టినా ఆశ్చర్యం అక్కర్లేదంటూ తన సహనటుడికి కితాబిస్తారు. ఐదు పదులకు చేరువైనా అంతే అందంగా కనిపిస్తున్నారంటే... ‘‘మీకు తెలుసా... వన వాసం ఎపిసోడ్స్‌లో కాస్త నీరసంగా కనిపించేందుకు అసలు మేకప్ వేసు కోలేదు’’ అని చెప్తారామె. రీ ఎంట్రీ ఎప్పు డనగానే ‘‘ఇంటికి, ఆఫీసు వ్యవహారాలకే టైమ్ సరిపోవట్లేదు. ఇప్పటికీ ఆఫర్లు వస్తు న్నాయ్. పనుల ఒత్తిడి వల్ల ఎస్ అనలేక పోతున్నాను.

చూద్దాం మూద్నాలుగేళ్ల తర్వాత ఏమైనా అవకాశం ఉండొచ్చు’’ అంటూ మనలోని ఆశని సజీవం చేస్తారామె. అది కూడా పౌరాణిక పాత్రలో నేనా అంటే..‘‘అవును అదైతేనే’’ అన్నారు. మానవమాత్రురాలిగా పుట్టి దేవత అనిపించుకోవడం ఎలా అనిపిస్తుంది అంటే అంతా ఆ దైవలీల అన్నట్టు ఆకాశంవైపు చూస్తూ భక్తిగా చేతులు జోడిస్తారు. రామయ్య తండ్రికి తోడుగా నీడగా నిలిచి తమకు ఆదర్శంగా జీవించిన సీతమ్మ పాత్రధారిణిని చూసి అప్పట్లో పాదాభివందనాలు చేసేవారట మహిళలు. మరిప్పుడు..‘‘ఇప్పటి జనరేషన్‌కు నేను తెలీదు. కాకపోతే అప్పటి వాళ్లు, కాస్త పెద్దవయసువాళ్లైతే కాళ్లకు దండం పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటారు’’అంటూ నవ్వేశారు. దేవుడైనా, దేవతైనా.. వారి గొప్పతనాన్ని అందరికీ చాటేదీ, చాటాల్సిందీ మాత్రం సాధారణ మానవులే. అలా తెలియజెప్పే అవకాశం దక్కించుకున్న దీపిక లాంటివారు అదృష్టవంతులవుతారు. అందరి అభిమానానికీ పాత్రులవుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil actress deepa
Ntr award for renowned actress sarada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles