సమస్యలపై రోడ్డెక్కిన పోలీసు కుటుంబాల తీరును ఉన్నతాధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. 'పోలీసు భార్య'ల ఆందోళనతో దిగొచ్చిన పోలీసు శాఖ.. వారి డిమాండ్లను అంగీకరించినా అమలు మాత్రం ఇప్పట్లో కుదరదని కొత్త మెలిక పెట్టింది. అయితే, సెలవులు ఇవ్వకుండా తమ కుటుంబ యజమానులతో అధికారులు పని చేయిస్తున్నారన్న ప్రధాన డిమాండ్ విషయంలో ఉన్నతాధికారులు రాజీ పడలేదు. శాంతి భద్రతల భారం కూడా ఏపీఎస్పీ సిబ్బందిపైనే పడుతున్నందున వారు అడిగిన విధంగా సెలవులు ఇవ్వలేమని డీజీ గౌతం సవాంగ్ తేల్చి చెప్పారు. రంజాన్, వినాయక చవితి వంటి పండుగలతోపాటు ఆగస్టు 15 పరేడ్ తదితరాల నేపథ్యంలో సెలవుల అమలు కొంత ఆలస్యమవుతుందన్నారు. డిసిప్లినరీ ఫోర్స్‌లో ఇలాంటి ఆందోళనలను క్షమించలేమని హెచ్చరించారు. ఆందోళనల వెనక సూత్రధారులను గుర్తించామని, వారిపై ఇప్పటికిప్పుడు కేసులు నమోదు చేయకపోయినా, వారిపై ఓ కన్నేసి ఉంచుతామని చెప్పారు.శని, ఆది వారాల్లో హైదరాబాద్‌లోని కొండాపూర్ 8వ బెటాలియన్ వద్ద జరిగిన ఆందోళన, రాష్ట్రవ్యాప్తంగా పాకిన తీరు, దాని వెనకున్న సూత్రధారులు ఎవరన్న దానిపై పక్కా సమాచారంతో ఏపీఎస్పీ అధికారులు డీజీపీ దినేశ్ రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం గౌతం సవాంగ్ శౌర్య భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. "భార్యలు చేసిన ఆందోళన వెనుక భర్తలున్నారు. మగాళ్లు మగాళ్లలా వచ్చి చట్టపరంగా అధికారుల దృష్టికి సమస్యలు తీసుకురావొచ్చు. కానీ, ఇలాంటి పనికి పాల్పడడం సిగ్గుచేటు'' అంటూ సవాంగ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మహిళలు తమ భర్తల సర్వీస్ మేటర్ గురించి అడగడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అయినా, వారి డిమాండ్లను డీజీపీ గుర్తించారన్నారు.ఆయన తమతో చర్చించారని, సిబ్బంది సంక్షేమం చూడాల్సిన బాధ్యత మనపై ఉంది గనుక వారి సమస్యలను పరిష్కరించేలా చూడాలని ఆదేశించారని తెలిపారు. అవినీతి విషయంలో కచ్చితమైన ఆధారాలతో ఫిర్యాదులు వస్తే.. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారన్నారు. కొండాపూర్ 8వ బెటాలియన్ వద్ద జరిగిన ఘటన సరికాకపోయినా గతం గతః అనుకొని ఇకపై ఎలా ఉండాలో ఆలోచించి ముందుకెళతామని చెప్పారు. ఏబీ ర్యాంకుల విధానాన్ని (కానిస్టేబుళ్ల పనితీరును బట్టి వారికి ర్యాంకులు ఇస్తారు. 'ఏ' ర్యాంకు ఇస్తే బాగా పనిచేస్తున్నట్టు. 'బి' ర్యాంకు ఇస్తే బాగా పని చేయనట్టు. అయితే, ఉన్నతాధికారుల అడుగులకు మడుగులు ఒత్తిన వారికే 'ఏ' ర్యాంకులు ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి) రద్దు చేశామని చెప్పారు. ఐజీ వెంకటేశ్వరరావు ఎలాంటి తప్పు చేయలేదని సవాంగ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more